: తెరకెక్కుతున్న తెలంగాణ పోరాటం!
దాదాపు వాస్తవిక సంఘటనల ఆధారంగా సినిమాలు రూపొందించే దర్శకుడు అల్లాణి శ్రీధర్. ఇప్పుడు దీర్ఘకాల పోరాటంతో సాకారమైన తెలంగాణ ఉద్యమంపై కన్నేశాడు. త్వరలో ఈ పోరాటాన్ని సిల్వర్ స్క్రీన్ పైకి తెచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ మేరకు తెలంగాణ పోరాటంపై ఓ చిత్రం రూపొందించనున్నట్లు అల్లాణి తెలిపాడు. ఈ కథపై ఎప్పుడూ సినిమా రూపొందించాలని అనుకుంటామని, తన స్నేహితులతో కలసి స్క్రిప్టు పనులు ప్రారంభించినట్లు చెప్పాడు. కథ మొత్తం యాభై ఏళ్ల కిందట మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకూ జరిగిన ఉద్యమం చుట్టూనే తిరుగుతుందని, ప్రతి విషయాన్ని ఇందులో చేర్చాలనుకుంటున్నట్లు వివరించాడు. దానికి సంబంధించి ఇప్పటికే పరిశోధన మొదలైందని కొన్ని వారాల్లో స్క్రిప్టు పని మొదలవుతుందని పేర్కొన్నాడు. గతంలో తెలంగాణ స్వాతంత్ర్య సమరయోధుడు కొమరం భీమ్ పై అల్లాణి ఓ చిత్రం రూపొందించాడు. దానికి పలు అవార్డులు కూడా దక్కాయి.