: రాష్ట్ర విభజనకు రాష్ట్రపతి ఆమోదముద్ర
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుకు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర వేశారు. రాష్ట్రపతి ఆమోదంతో మార్చి 1వ తేదీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన నోటిఫైడ్ డేట్ అయింది. దీనికి సంబంధించి కాసేపట్లో కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ వెలువరించనుంది.