: రాష్ట్రపతి పాలనకు ప్రణబ్ ముఖర్జీ ఆమోద ముద్ర
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలనకు భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఆమోదముద్ర వేశారు. గత శుక్రవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని నిర్ణయించి, రాష్ట్రపతి ఆమోదం కోసం పంపిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ఆమోదంతో, రాష్ట్ర చరిత్రలో రెండో సారి రాష్ట్రపతి పాలన ప్రారంభమైంది. కేంద్ర ప్రభుత్వం నుంచి గవర్నర్ కు ఉత్తర్వులు అందగానే, ఇక్కడ గవర్నర్ పాలన ప్రారంభమవుతుంది. అప్పటి నుంచి రాష్ట్ర పాలనా వ్యవహారాలు గవర్నర్ చేతిలోకి వెళతాయి. మంత్రుల స్థానంలో అధికారులు పాలనా కార్యకలాపాలను కొనసాగిస్తారు.