: ఫిబ్రవరి 28 లోపే ఆప్కో ఎన్నికలు: మంత్రి ప్రసాద్ కుమార్
ఫిబ్రవరి 28 లోపు ఆప్కో ఎన్నికలు జరుగుతాయని చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్ కుమార్ హైదరాబాదులో చెప్పారు. మరో రెండు రోజుల్లో ఆప్కో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనున్నట్లు ప్రసాద్ కుమార్ తెలిపారు. మార్చి నెల కల్లా చిన్న తరహా పరిశ్రమలకు విద్యుత్ కొరతని తొలగిస్తామని మంత్రి హామీ ఇచ్చారు.