: బీజేపీకి నేను కూతురులాంటి దాన్ని: రాఖీ సావంత్


ఈ మధ్య రాజకీయాలపై దృష్టి సారించిన ఐటమ్ గాళ్, నటి రాఖీ సావంత్ ఏది మాట్లాడినా సంచలనమవుతోంది. మొన్నామధ్య రాహుల్ గాంధీ ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటానని పెద్ద దుమారమే రేపింది. ఇప్పుడు తాను భారతీయ జనతా పార్టీకి కుమార్తె లాంటి దాన్నని తనకు తానుగా చెప్పుకుంది. అంతేకాదు, ఆ పార్టీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు తెలపాలని ప్రజలను కోరింది. తదుపరి దేశ ప్రధాని మోడీయే అవుతారని ధీమా వ్యక్తం చేసింది. కొన్ని రోజుల కిందట ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయానికి వెళ్లిన రాఖీ పైవిధంగా మాట్లాడింది. అయితే, పార్టీలో చేరే విషయంపై తనకెలాంటి ఆలోచన లేదని, దానిపై పార్టీ సీనియర్ నేతలే చెప్పాలన్నది.

  • Loading...

More Telugu News