: సీమాంధ్ర ఆర్థిక పరిస్థితిని కేంద్రం పట్టించుకోలేదు: వెంకయ్యనాయుడు
వచ్చే అక్టోబరు వరకు సీమాంధ్ర ఆర్థిక పరిస్థితి ఏమిటనేది కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు అన్నారు. విశాఖపట్నంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రాన్ని విభజించారు కానీ.. రాజధాని ఏర్పాటుకు మాత్రం ఇంకా సమయముందని అంటున్నారని కేంద్ర ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. తెలివైన ప్రభుత్వం కేంద్రంలో ఉంటే విభజన ప్రక్రియ కాస్త ముందుగానే పూర్తి చేసేదని ఆయన అభిప్రాయపడ్డారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు భవిష్యత్ లో అన్ని చోట్లా నిర్మించాలని సూచించిన ఆయన, అన్ని రాష్ట్రాల్లో అధికార వికేంద్రీకరణ జరగాలని అభిప్రాయపడ్డారు.