: సంయుక్త అంతరిక్ష యాత్రలకు భారత్, అమెరికా రెడీ


భారత అంతరిక్ష రంగంలో చిరస్మరణీయ ఘట్టంగా పేర్కొనదగిన చంద్రయాన్-1 విజయవంతం అయిన తర్వాత మరోసారి జట్టు కట్టేందుకు భారత్, అమెరికా సిద్ధమయ్యాయి. చంద్రుడితోపాటు అంగారక గ్రహంపైకి భవిష్యత్తులో చేపట్టబోయే అంతరిక్ష యాత్రలకు పరస్పరం సహకరించుకోవాలని, సంయుక్త రోదసీ యాత్రలు నిర్వహించాలని ఇరు దేశాలు ఓ అంగీకారానికి వచ్చాయి.

భారత్ అంతరిక్ష సంస్థ ఇస్రో.. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా తోడ్పాటుతో 2008లో చంద్రయాన్-1 పేరిట చంద్రుడిపైకి ఆర్బిటర్ ను పంపింది. ఆ ఆర్బిటర్ లో నాసా కు చెందిన కొన్ని పరికరాలున్నాయి. నిన్న అమెరికాలో జరిగిన ఇండో-యూఎస్ పౌర రోదసీ సంయుక్త కార్యాచరణ సంఘం సమావేశంలో ఈ వివరాలు తెలియజేశారు. 

  • Loading...

More Telugu News