: తెలుగు ప్రజలను ముంచడానికి మరోసారి రెడీ అవుతున్నారు: బైరెడ్డి


సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడుతామని టీడీపీ నేతలు చంకలు గుద్దుకుంటున్నారని రాయలసీమ పరిరక్షణ సమితి అధ్యక్షుడు బైరెడ్డి రాజశేఖర రెడ్డి అన్నారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఇప్పుడు రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన నాయకులే మళ్లీ అధికారంలోకి వచ్చేందుకు కుమ్మక్కవుతున్నారని దుయ్యబట్టారు. మరోసారి తెలుగు ప్రజలను నిలువునా ముంచేసేందుకు పార్టీల నేతలంతా సిద్ధమవుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగు జాతిమీద ప్రేమ ఉన్నట్టు మాట్లాడిన వారంతా పార్టీలు మారాల్సిన అవసరం ఏమిటని ఆయన నిలదీశారు. ఇప్పుడు ఉన్న టీడీపీ ఎన్టీఆర్ పెట్టిన టీడీపీ కాదని, తెలంగాణ దేశం పార్టీ అని, లేదా తెలుగు కాంగ్రెస్ పార్టీ అని ఆయన ఎద్దేవా చేశారు. కొన్ని పార్టీలు ఎవరిని చేర్చుకోవాలా అని తొందర పడుతోంటే, కొన్ని పార్టీల్లోకి ఎలా వెళ్లాలా? అని మరి కొందరు తొందర పడుతున్నారని ఆయన మండిపడ్డారు. 'ఈ నేతలా తెలుగు ప్రజలను బాగుచేసేది? వీరికా తెలుగు ప్రజలు ఓట్లు వేసేది?' అని ఆయన తీవ్ర స్వరంతో విమర్శించారు.

  • Loading...

More Telugu News