: పాక్ క్రికెటర్ ఉమర్ అక్మల్ కు కోర్టు నోటీసులు
పాకిస్థాన్ స్టార్ బ్యాట్స్ మ్యాన్ ఉమర్ అక్మల్ కు కోర్టు నోటీసులు జారీ అయ్యాయి. రెడ్ సిగ్నల్ పడినా.. దాటుకుని పోవడమే కాకుండా.. ట్రాఫిక్ పోలీసులతో వాదనకు దిగినందుకు ఆయనపై ఇటీవల కేసు దాఖలైంది. పోలీసులు అక్మల్ ను అరెస్ట్ చేసి గతనెల 1న కోర్టులో హాజరు పరచగా.. బెయిల్ పై విడుదలయ్యాడు. ఈ కేసులో విచారణ కోసం ఈ నెల 11న విచారణకు హాజరు కావాలని ఆదేశిస్తూ కోర్టు అక్మల్ కు నోటీసులు జారీ చేసింది.