: కేసీఆర్ పై రేవూరి ప్రకాష్ రెడ్డి ఫైర్


రాజకీయ జీవితం ఇచ్చిన తెలుగుదేశాన్నే దెబ్బతీయడానికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని టీడీపీ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఎదుగుదలకు టీడీపీనే ఉపయోగపడిందన్న విషయాన్ని విస్మరించారన్నారు. టీఆర్ఎస్ పెట్టిన రోజుల్లో ఉన్న నేతలు అనేకమంది ఇప్పుడు ఆ పార్టీలో ఎందుకు లేరని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయాన్ని ఇచ్చిన కొండా లక్ష్మణ్ బాపూజి చనిపోతే కనీసం చూడటానికి కూడా కేసీఆర్ రాలేదని మండిపడ్డారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లిన పలువురు నేతల పేర్లు ప్రస్తావించిన రేవూరి, వారంతా పార్టీకి ఎలా దూరమయ్యారని అడిగారు. కేసీఆర్ ప్రజలను మోసం చేస్తున్నందువల్లే వారంతా దూరమయ్యారన్నారు. అంతేగాక, తెలంగాణకోసం పోరాటం చేసిన అమరవీరులను పూర్తిగా విస్మరించారన్నారు. సోనియా వద్దకు నాయిని, ఈటెల, కోదండరామ్ వంటివారిని కేసీఆర్ ఎందుకు తీసుకెళ్లలేదని రేవూరి నిలదీశారు.

  • Loading...

More Telugu News