: వేరే కళాశాలలో చేరినా... వదలని కామాంధ ఆచార్యుడు!
కామా తురానాం న భయం న లజ్జ అని పెద్దలు అన్నట్టు... కామాంధులకు తమ స్థాయి కానీ, కట్టుబాట్లు కానీ గుర్తురావడంలేదు. విద్యాబుద్ధులు నేర్పి పట్టభద్రులను చేయాల్సిన ఆచార్యుడు, కామాంధుడై విద్యార్థినిని వేధిస్తుండడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తమిళనాడు సేలం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రిలో పిల్లల వైద్య విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ సెంథిల్ కుమార్(46)ను తమిళనాడు మహిళల వేధింపుల చట్టం, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టంలోని సెక్షన్ 66(ఎ) ప్రకారం పోలీసులు అరెస్టు చేశారు.
సేలంలో మెడిసిన్ చదివిన ఓ విద్యార్థినిని సెంథిల్ కుమార్ లైంగికంగా వేధించేవాడు. అయినప్పటికీ ఆమె గురువు కదా అని, ప్రాక్టికల్స్ వంటి ఇబ్బందులు ఉండడంతో చదువుకు ఆటంకం కలుగకూడదని భావించి పెద్దగా పట్టించుకోలేదు. కేరళ కాలికట్ లో ఎండీ చదివేందుకు ఆమె వెళ్లిపోయింది. సామాజిక నెట్ వర్క్ ద్వారా ఆమెకు అసభ్య చిత్రాలు, మెసేజ్ లు పంపుతూ ఆమెను వేధించడం మొదలు పెట్టాడా కామాంధ ఆచార్యుడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతడి ఆటకట్టించారు. బాధితురాలికి పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండడం విశేషం!