: జంతువనుకుని స్నేహితుడి ప్రాణాలు తీశాడు!
చెట్ల మధ్య కదులుతున్నది జంతువనుకుని తన స్నేహితుణ్ణి కాల్చాడో వ్యక్తి. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. భాగమండళ పట్టణం సమీప గ్రామం కోలగదళు గ్రామస్తులైన తీర్థకుమార్, లవ స్నేహితులు. వీరిద్దరూ ఓరోజు అడవిలో జంతువులను వేటాడాలని నిర్ణయించుకున్నారు. ఈమేరకు తీర్థకుమార్ ఎస్టేట్ కు వెళ్ళారు. కాలి నొప్పితో లవ ఎస్టేట్ గెస్ట్ హౌస్ కే పరిమితమయ్యాడు. తీర్థకుమార్ తుపాకీ తీసుకుని సమీప అడవిలోకి వెళ్ళి జంతువుల కోసం వెదకసాగాడు. ఓ చోటు అలికిడి వినిపించడంతో అటువైపు తుపాకీతో కాల్చాడు. వెంటనే మనిషి అరుపు వినిపించడంతో పరుగుపరుగున అక్కడికెళ్ళి చూసి నిరుత్తరుడయ్యాడు. అక్కడ రక్తపు మడుగులో తన స్నేహితుడు లవ పడి ఉన్నాడు. అతను చనిపోవడంతో తీర్థకుమార్ పోలీసులకు లొంగిపోయాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ఆరంభించారు.