: ఈ విమానాన్ని కొట్టే మొనగాడు లేడు!
బ్రిటన్ శాస్త్రవేత్తలు అత్యంత భారీ విమానానికి రూపకల్పన చేశారు. 300 అడుగుల పొడవున్న ఈ మహా ప్లేన్ ఒక్కసారి ఇంధనం నింపుకుంటే మూడువారాల పాటు నిరంతరాయంగా ఎగరగలదు. ఇప్పటివరకు ప్రపంచ విమానాల్లో రారాజులుగా వెలుగొందుతున్న ఎయిర్ బస్ ఏ-380, బోయింగ్ 747-8ల కంటే ఇది 60 అడుగుల పొడవు ఎక్కువగా ఉంటుంది. దీన్ని హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్ (హెచ్ఏవి) సంస్థ రూపొందించింది. అందుకైన ఖర్చు అక్షరాలా... రూ.621 కోట్లు. ప్రధానంగా దీన్ని అమెరికా మిలిటరీ అవసరాల కోసం తయారుచేశారు. దీని ద్వారా ఏకబిగిన 50 టన్నుల సరుకు రవాణా చేయవచ్చట. అంతేగాకుండా 50 మంది వ్యక్తులు ప్రయాణించవచ్చని ఈ బ్రిటన్ కంపెనీ తెలిపింది.