: విశాఖ 'ప్రజాగర్జన'లో టీడీపీలో చేరుతున్న గంటా
ఈ నెల 12న టీడీపీలో చేరేందుకు మాజీమంత్రి గంటా శ్రీనివాసరావు సిద్ధమయ్యారు. ఈ మేరకు విశాఖపట్టణంలో అదే తేదీన జరగనున్న 'ప్రజాగర్జన' సభలో గంటా సహా నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు. అధినేత చంద్రబాబు వారికి టీడీపీలోకి ఆహ్వానం పలుకుతారు. మరోవైపు మూడు లక్షల మందితో ప్రజాగర్జన సభ నిర్వహించాలని టీడీపీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.