: కంప్యూటరే చెవిరింగులా మారిపోతే!


కంప్యూటర్ టేబుల్ పైనే ఉండాలి.. ఇది తప్పని ల్యాప్ టాప్ లు నిరూపించాయి. కంప్యూటర్లు చేతిలో ఇమిడిపోతే బావుండు.. ఇది ఎప్పుడో సాకారమైంది. కంప్యూటర్లను కళ్లద్దాలుగానూ మార్చవచ్చని గూగుల్ పరిశోధకులు రుజువు చేశారు. కంప్యూటర్లు చెవి రింగులుగా ఎందుకు మారవు? జపాన్ శాస్త్రవేత్తలు ఇప్పుడు ఇదే పరిశోధనలో ఉన్నారు.

చెవిరింగులా ధరించగలిగే కంప్యూటర్ ను తయారు చేసే పనిలో నిమగ్నమయ్యారు. 17 గ్రాముల బరువుండే ఇది బ్లూటూత్ ఆధారంగా పనిచేస్తుందట. ఇందులో మైక్రోచిప్ ఉంటుందని హిరోషిమా సిటీ వర్శిటీకి చెందిన ఇంజనీర్ కజుహిరో చెప్పారు. ఇంకా జీపీఎస్, దిక్సూచీ, గైరో సెన్సార్, బ్యాటరీ, బారోమీటర్, స్పీకర్, మైక్రోఫోన్ ఇందులో ఉంటాయి. చెవిరింగే దీన్ని రూపొందించడానికి వెనుకనున్న ఐడియా అని కజుహిరో తెలిపారు. 2015 నాటికి దీన్ని అందుబాటులోకి తేవాలనుకుంటున్నారు.

దీన్ని ఐపాడ్, ఇతర గాడ్జెట్లకు కనెక్ట్ చేసుకుని వాడుకోవచ్చట. ముఖ కవళికలు, కనురెప్పలు కదిలించడం, నాలుకను కదిలించడం ద్వారా దీన్ని వినియోగించవచ్చని చెబుతున్నారు. ఒక చోట నించుని ఆకాశంలో చూస్తున్నారనుకోండి.. మీరు ఎక్కడున్నారు.. చూస్తున్న నక్షత్రం ఏంటో కూడా ఇది చేప్పేయగలదని కజుహిరో అంటున్నారు. అంతేకాదట.. అదే సమయంలో అదే నక్షత్రాన్ని వేరొక ప్లేస్ లో మరెవరైనా చూస్తుంటే వారితో మిమ్మల్ని అనుసంధానిస్తుందని చెబుతున్నారు. అంటే ఇది పిట్టకొంచెమే అయినా.. కూత ఘనం లాంటిదన్నమాట.

  • Loading...

More Telugu News