: ఆమ్ ఆద్మీకి లండన్ ఐటీ ఉద్యోగుల ప్రచారం


అవినీతి, రాజకీయాలే దేశాన్ని ఏలుతున్న ప్రస్తుత సమాజంలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆశావహంగా తెరపైకి వచ్చింది. ఏర్పాటు చేసిన సంవత్సరానికే ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి ఘనత సాధించింది. మరి ఏఏపీకి ఒక్క ఢిల్లీ ప్రజల మద్దతే ఉందా? అంటే కాదనే చెప్పాలి. తొలుత నుంచి లండన్ లోని పలువురు ఐటీ ఉద్యోగులపై ఈ పార్టీ ప్రభావం పడింది. ఎన్నికల సమయంలో చాలా మంది తమవంతు విరాళాలు కూడా ఇచ్చారు ఇప్పటికీ ఇస్తున్నారు. ఆ ఉత్సాహంతో లండన్ లో ఏఏపీ కార్యాలయం కూడా ప్రారంభించారు.

ఈ క్రమంలో రవీందర్ సిరోహి అనే ఐటీ ఉద్యోగి ప్రతిరోజూ ఏఏపీకి రూ.2014 విరాళాన్ని ఇస్తున్నాడు. జనవరి 1, 2014 నుంచి ఈ విధంగా ఇస్తున్నాడట. 'విరాళం ఇవ్వాలనుకున్నప్పుడు వెంటనే నా భార్యతో మాట్లాడాను. ఒప్పుకోవడంతో ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. ఇంటిలోనే కాఫీ, బ్రేక్ ఫాస్ట్ అంతా నా భార్య తయారుచేస్తే తీసుకుని ఆఫీసుకు వెళతాను. అదే యూకెలో కుటుంబమంతా బయటికి వెళితే ఆరు పౌండ్ల ఖర్చవుతుంది. అది నా జీతంలోని ఒక భాగాన్ని తగ్గించేస్తుంది. అందుకే చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలనుకుంటున్నాం' అని రవీందర్ వివరించాడు.

మరోవైపు సాఫ్ట్ వేర్ డెవలపర్ గా పని చేస్తున్న అష్రఫ్ సర్వత్ అనే మహిళ స్వచ్ఛంధంగా ఏఏపీ తరపున వచ్చే 2014 సార్వత్రిక ఎన్నికలకు 'కాల్ ఢిల్లీ' యూకెలో ప్రచారం నిర్వహించింది. అరవింద్ కేజ్రీవాల్ గురించి తెలియజేస్తున్నారు. ఇలా అనేకమంది ఐటీ ఉద్యోగులు ఏఏపీ మద్దతుదారులయి ప్రచారం కల్పిస్తున్నారు.

  • Loading...

More Telugu News