: రాహుల్ గాంధీని ముద్దుపెట్టుకున్న మహిళ అనుమానాస్పద మృతి


మూడు రోజుల క్రితం (ఫిబ్రవరి 26న) అసోంలోని జోరత్ లో స్వయంసహాయక బృందాలతో జరిగిన ఓ కార్యక్రమంలో... రాహుల్ గాంధీని కొంత మంది మహిళలు ఊహించని విధంగా ముద్దు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వారిలో వెనుకవైపు నుంచి వచ్చి రాహుల్ బుగ్గపై ముద్దాడిన వార్డు మెంబర్ 'బోంటి' కాలిన గాయాలతో మృతి చెందింది. ముద్దుపెట్టుకున్న సమయంలో ఇది పెద్దగా కలకలం సృష్టించనప్పటికీ, తరువాత వారి కుటుంబంలో పెద్ద చిచ్చునే రేపింది. బోంటి, ఆమె భర్త మూడు రోజుల క్రితం తీవ్రంగా గొడవపడ్డారు. ఈ రోజు ఆమె కాలిన గాయాలతో చనిపోయింది. ఆమె భర్తే ఆమెకు నిప్పంటించాడనే అనుమానాలున్నాయి. ఈ ప్రమాదంలో ఆమె భర్తకు కూడా తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే మహిళ మృతికి, రాహుల్ ముద్దుకి సంబంధం లేదని పోలీసులు అంటున్నారు.

  • Loading...

More Telugu News