: ఉచిత విద్యుత్ మత్తుమందులాంటిది: ఫరూక్ అబ్దుల్లా


కేంద్ర సంప్రదాయేతర ఇంధన వనరుల శాఖా మంత్రి ఫరూక్ అబ్దుల్లా ఉచిత విద్యుత్ ను కొకైన్ (మత్తు పదార్థం) తో పోల్చారు. ప్రజలకు ఉచిత విద్యుత్ ఇవ్వడాన్ని వెంటనే నిలిపివేయాలని అభిప్రాయపడ్డారు. ఢిల్లీలో తన శాఖకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ ఫరూక్ ఇలా మాట్లాడారు. 'ఈ దేశంలో ప్రజలకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడాన్ని నిలిపివేయాలి. ఒక రకంగా ప్రజలకు కొకైన్ ఇవ్వడం లాంటిదే ఇది. ప్రజలు దీనికి బానిసలయ్యారంటే ఇక దీనిని ఆపతరం కాదు. ప్రతి ఐదేళ్లకోసారి (ఎన్నికలు జరిగే కాలం) ఈ కొకైన్ డోస్ ను రెట్టింపు చేయాల్సి వస్తుంది' అన్నారు.

  • Loading...

More Telugu News