: శాసనసభ్యులకు పదవులుంటాయి కాని... అధికారాలు ఉండవు


సాధారణంగా రాష్ట్రపతి పాలనను రెండు విధాలుగా విధిస్తారు. మొదటిది శాసనసభను పూర్తిగా రద్దు చేయడం, రెండోది సభను నిద్రావస్థ (సస్పెండెడ్ యానిమేషన్)లో ఉంచడం. మన రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనను రెండో మార్గం ద్వారా విధించబోతున్నారు. అంటే సభను పూర్తిగా రద్దు చేయకుండా, సస్పెండెడ్ యానిమేషన్ లో ఉంచబోతున్నారు. దీంతో, రాష్ట్రపతి పాలన అమల్లోకి వచ్చిన వెంటనే శాసనసభ సుప్తచేతనావస్థలోకి వెళ్లిపోతుంది. దీనర్థం... శాసనసభ్యులకు తమ పదవులు ఉంటాయి... కానీ, వారికి ఎలాంటి బాధ్యతలు కానీ, అధికారాలు కానీ ఉండవు. శాసనసభ కమిటీలు ఏవీ పనిచేయవు. శాసనసభ్యులు ఏ కార్యక్రమానికైనా అధికారిక హోదాలో హాజరయ్యే అవకాశం ఉండదు. అయితే, సభ్యులకు నెలవారీ జీతభత్యాలు మాత్రం యథాతథంగా వస్తాయి.

  • Loading...

More Telugu News