: కేపీహెచ్ బీ కాలనీలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల దుర్మరణం


ఈ తెల్లవారుజామున చెట్టును కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన హైదరాబాద్ కేపీహెచ్ బీ కాలనీ సమీపంలో ఉన్న ప్రగతి నగర్ లో జరిగింది. రహదారిపై వెళ్తున్న వాహనదారులు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో, హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు సుదీప్, ఇట్యాగాలు నగరంలోని ప్రముఖ సాఫ్ట్ వేర్ కంపెనీల్లో పనిచేస్తున్నట్టు పోలీసులు వివరించారు.

  • Loading...

More Telugu News