: ఆసక్తికరంగా భారత్, లంక మ్యాచ్
ఆసియా కప్ లో నేడు జరుగుతున్న భారత్, శ్రీలంక జట్ల మధ్య మ్యాచ్ ఆసక్తికరంగా మారింది. ఈ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో లంకేయులు 30 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లకు 141 పరుగులు చేయాలి. ఆ జట్టు గెలవాలంటే 20 ఓవర్లలో 124 పరుగులు చేయాలి. ప్రస్తుతం క్రీజులో సంగక్కర (30 బ్యాటింగ్), జయవర్ధనే (3 బ్యాటింగ్) ఉన్నారు. అశ్విన్ రెండు వికెట్లు తీశాడు.