: కేజ్రివాల్ పై అన్నా ధ్వజం


ఒకప్పుడు అరవింద్ కేజ్రివాల్ కు అత్యంత ఆప్తుడైన అన్నా హజారే నేడు తన శిష్యుడిపై కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ పెట్టిన కేజ్రివాల్ అధికార దాహంతో వేగిపోతున్నారని విమర్శించారు. పుణేలో మీడియాతో మాట్లాడుతూ, కేజ్రివాల్ తన 17 సూత్రాల అజెండాను విస్మరించారని ఆరోపించారు. తన అజెండాకు సమ్మతిస్తే మద్దతిస్తానని కేజ్రివాల్ కు చెప్పానని అన్నా వివరించారు. ఇప్పుడో విషయం స్పష్టమైందని, కేజ్రివాల్ అతని మద్దతుదారులకు పదవే పరమావధిగా మారిందని దుయ్యబట్టారు. వీళ్ళకూ ఇతర పార్టీలకు తేడా లేకుండా పోయిందని విమర్శించారు.

  • Loading...

More Telugu News