: కర్ణాటక మాండ్యా లోక్ సభ స్థానంలో 'సినీ' పోరు


కర్ణాటకలోని మాండ్యా లోక్ సభ స్థానంలో ఈసారి పోరు ఆసక్తికరంగా మారనుంది. ప్రస్తుతం మాండ్యాకు కన్నడ నటి రమ్య ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవలే ముగిసిన పార్లమెంటు సమావేశాలకు చివరిరోజున చెరుకు రైతుల వెతలపై ఆమె ప్రసంగం సభికులను ఆకట్టుకుంది. కాగా, సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తుండడంతో మాండ్యా నుంచి పోటీ చేసేందుకు పలువురు సినీ తారలు ఆసక్తి చూపుతున్నారు. రమ్య ఎలాగూ కాంగ్రెస్ తరుపున పోటీ చేస్తున్నారు. ఇక, జనతాదళ్ (సెక్యులర్) పార్టీలో చేరిన నటి రక్షిత మాండ్యా సీటు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తోంది.

మరోవైపు బీజేపీ యాక్షన్ హీరో ఉపేంద్రకు గాలం వేస్తోంది. అతని ఛరిష్మా ఎన్నికల్లో ఉపయోగపడవచ్చని కమలనాథులు భావిస్తున్నారు. బీజేపీ తనతో చర్చలు జరుపుతున్న విషయాన్ని ఉపేంద్ర కూడా ధృవీకరించారు. తనకూ రాజకీయాలంటే ఆసక్తి ఉందని ఆయన తెలిపారు. ఉపేంద్ర అంగీకరిస్తే మాండ్యా బరిలో దించాలని బీజేపీ వ్యూహకర్తలు ప్రణాళికలు రచిస్తున్నారు.

  • Loading...

More Telugu News