: ప్రతి పేద కుటుంబానికి ఓ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తాం: కేసీఆర్


తెలంగాణలోని బలహీన వర్గాల కుటుంబాలకు డబుల్ బెడ్ రూం ఇళ్లను కట్టిస్తామని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హామీ ఇచ్చారు. రాష్ట్ర పునర్నిర్మాణం కోసం ఇదే ఉద్యమాన్ని కొనసాగించాలని తెలంగాణవాదులకు పిలుపునిచ్చారు. టీడీపీ నేతలు మహేందర్ రెడ్డి, రత్నం, నరేందర్ లు టీఆర్ఎస్ లో చేరిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ఐఏఎస్, ఐపీఎస్ ల పిల్లలు చదువుకునే వాటి కంటే మెరుగైన స్కూళ్లలో పిల్లలందరికీ నిర్బంధ విద్యను అమలు చేస్తామని చెప్పారు. గెలిచిన ఎమ్మెల్యేలందరూ తెలంగాణ అభివృద్ధి కోసం 24 గంటలు పనిచేయాలని కోరారు.

  • Loading...

More Telugu News