: టీమిండియాను తిప్పేశారు


లంక స్పిన్ ఉచ్చులో చిక్కుకుని భారత్ ఇక్కట్లపాలైంది. ఆసియా కప్ లో భాగంగా ఫతుల్లాలో జరుగుతున్న పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లకు 264 పరుగులు చేసింది. ఓ దశలో రెండు వికెట్లకు 175 పరుగులతో పటిష్టంగా ఉన్న భారత బ్యాటింగ్... ఆ తర్వాత లంక స్పిన్నర్ల ధాటికి విలవిల్లాడింది. అజంత మెండిస్ (4/60), సేనానాయకే (3/41) భారత్ ను సమర్థంగా కట్టడి చేశారు. ఓపెనర్ శిఖర్ ధావన్ 94 పరుగుల వద్ద అవుట్ కాగా, కోహ్లీ 48 పరుగులు చేశాడు. మిడిలార్డర్లో జడేజా 22 పరుగులతో అజేయంగా నిలిచాడు.

  • Loading...

More Telugu News