: ‘సోనియమ్మకు సలాం’ సభకు సర్వం సిద్ధం


ఇచ్చిన మాటకు కట్టుబడి తెలంగాణను ప్రకటించిన కాంగ్రెస్ అధినేత్రికి ధన్యవాదాలు తెలిపేందుకు ‘సోనియమ్మకు సలాం’ అంటూ సభను ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ ఎంపీ రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతోన్న ఈ సభ నల్లగొండ జిల్లా భువనగిరిలో ఈరోజు సాయంత్రం మొదలుకానుంది. ఈ సభ ప్రాంగణానికి మధ్యాహ్నం నుంచే కాంగ్రెస్ కార్యకర్తల రాక మొదలైంది. పట్టణ ప్రజలు సభను ప్రత్యక్షంగా వీక్షించేందుకు వీలుగా భువనగిరిలో రెండు ప్రాంతాల్లో పెద్ద స్క్రీన్ లను ఏర్పాటు చేశారు. ‘సోనియమ్మకు సలాం’కు హాజరయ్యేందుకు ఎంపీలు రాజగోపాల్ రెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు బీబీనగర్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి ద్విచక్ర వాహన ర్యాలీతో బయల్దేరి, భువనగిరిలోని సభా ప్రాంగణానికి వారు చేరుకోనున్నారు.

  • Loading...

More Telugu News