: మంత్రులూ, మా జీతాలు పెంచాల్సిందే: అంగన్ వాడీలు
తమ సమస్యలను పరిష్కరించాలంటూ గత కొంతకాలంగా డిమాండ్ చేస్తున్న అంగన్ వాడీ కార్యకర్తలు తమ ఆందోళనలను కొనసాగిస్తున్నారు. ఈరోజు (శుక్రవారం) గుంటూరు జిల్లా భట్టిప్రోలులో అంగన్ వాడీలు కేంద్రమంత్రి పనబాక లక్ష్మిని నిర్బంధించారు. పనబాక తహశీల్దార్ కార్యాలయానికి వచ్చినప్పుడు ఈ ఘటన జరిగింది.
అంతేకాకుండా, శ్రీకాకుళంలో కేంద్రమంత్రి కిల్లి కృపారాణి క్యాంపు కార్యాలయాన్ని కూడా అంగన్ వాడీ కార్యకర్తలు ముట్టడించారు. అయితే, ఆందోళన చేస్తున్న అంగన్ వాడీలను పోలీసులు అడ్డుకుని, అదుపులోకి తీసుకున్నారు. ప్రభుత్వం తమ కనీస వేతనాలను పెంచాలని వారు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.