: మావోయిస్టుల దాడిలో ఏడుగురు జవాన్లు మృతి
చత్తీస్ గఢ్ లోని దంతెవాడలో మావోయిస్టులు జవాన్లపై మెరుపుదాడి చేశారు. ఈరోజు (శుక్రవారం)శ్యామ్ గిరి ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తున్న వ్యానును మావోలు పేల్చివేశారు. మావోయిస్టుల దాడిలో ఏడుగురు జవాన్లు మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ దుర్ఘటన గువాకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని శ్యామ్ గిరిలో జరిగినట్లు సమాచారం.