: శ్రీకాళహస్తీశ్వరాలయంలో వైభవంగా రథోత్సవం


చిత్తూరు జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రం శ్రీకాళహస్తీశ్వరాలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా, ఆలయంలో ఈరోజు (శుక్రవారం) రథోత్సవం కన్నుల పండువగా సాగింది. రథంపై స్వర్ణాలంకార భూషితులై ఆసీనులైన స్వామి, అమ్మవార్లు ఆలయ మాడవీధుల్లో విహరించారు. అశేష భక్తజనవాహిని వెంట రాగా శివనామస్మరణతో రథోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవాలకు హాజరైన భక్తులతో శ్రీకాళహస్తి పురవీధులు కిటకిటలాడాయి.

  • Loading...

More Telugu News