: ఆ ఐదు రోజులూ మహిళలు ఆధిపత్యాన్ని కోరుకుంటారట!
నెల నెల.. ప్రతినెలా.. ఓ ఐదు రోజులు మహిళలు.. తోటి మహిళలపై ఆధిపత్యాన్ని కోరుకుంటారట. మహిళలకు నెలనెలా రుతుచక్రం మూడు నుంచి ఐదు రోజుల వరకు కొనసాగుతుందని తెలిసిందే. ఈ సమయంలో వారి ప్రవర్తనలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంటుంది. కోపం, చిరాకుపడడం, ఓపిక తక్కువగా ఉండడం తెలిసిందే. కానీ, ఈ సమయంలో మహిళలు తోటి మహిళలపై తమదే ఆధిపత్యం ఉండాలని కోరుకుంటున్నట్లు టెక్సాస్ యూనివర్సిటీ శాస్త్రవేత్తల అధ్యయనంలో వెల్లడైంది. అధ్యయనంలో భాగంగా నెలసరి సమయంలో మహిళలకు కొంత డబ్బులు ఇచ్చి చూడగా.. వారు ఇతర మహిళలతో పంచుకోవడానికి ఇష్ట పడలేదట. అదే సాధారణ మహిళలకు ఇచ్చి చూస్తే.. వారు అందులో సగంమేర సాటి మహిళలతో పంచుకున్నారని శాస్త్రవేత్తలు తెలిపారు.