: కోర్టు దగ్గర ఉద్రిక్త వాతావరణం.. బెయిల్ కోసం ఎదురుచూపులు


సడక్ బంద్ నేపధ్యంలో తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు కోదండరామ్ సహా మరికొంత మందిని మొన్న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. వీరంతా ప్రస్తుతం మహబూబ్ నగర్ జైలులో ఉన్నారు. వీరిపై పలు కీలక సెక్షన్ల కింద పోలీసులు నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. ఈ తరుణంలో వీరికి బెయిల్ వస్తుందా? రాదా? అనే దానిమీద అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

కాగా, తెలంగాణ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ ప్రస్తుతం ఉస్మానియా యూనివర్శిటీ పరిధిలోని పీజీ సెంటర్లో ప్రొఫెసర్ గా ఉద్యోగంలో వున్నారు. అలాగే, తెలంగాణా గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస గౌడ్ కూడా ప్రభుత్వ ఉద్యోగే. వీరిద్దరికీ బెయిల్ రావడం అత్యవసరం. ఎందుకంటే,  ప్రభుత్వోద్యోగంలో ఉన్న వ్యక్తి 48 గంటలపాటు రిమాండులో ఉంటే అతన్ని ఉద్యోగం నుంచి సస్పెండ్ చేయాల్సి ఉంటుంది. అందుకే, తెలంగాణ వాదులతో పాటు అందరిచూపు కోదండరామ్, శ్రీనివాస గౌడ్ లకు బెయిల్ వస్తుందా? రాదా? అనే దానిమీదే నెలకొంది. దీనిపై మరికొంత సేపట్లో ఆలంపూర్ కోర్టు తన తీర్పును వెలువరించనుంది. 

తీర్సు వెలువడే తరుణంలో తమ నేతలకు సంఘీభావం తెలిపేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తో సహా పలువురు టీఆర్ఎస్ నేతలు, కాంగ్రెస్ ఎంపీలు మంద జగన్నాథం, రాజయ్య, మాజీ ఎంపీ కె.కేశవరావు తదితరులు కోర్టుకు చేరుకుంటున్నారు. చుట్టు ప్రక్కల ప్రాంతాలనుంచీ పలువురు తెలంగాణ వాదులు  కోర్టు ప్రాంగణం వద్దకు చేరుకోవటంతో మహబూబ్ నగర్ జిల్లా కోర్టు వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. 

  • Loading...

More Telugu News