: లియాన్ నాలుగు.. భారత్ ఐదు


కోట్లా టెస్టు రెండో రోజు ఆటలో ఆసీస్ స్పిన్నర్ నాథన్ లియాన్ చెలరేగిపోయాడు. స్పిన్ కు సహకరిస్తున్న పిచ్ పై భారత బ్యాట్స్ మెన్ ను ఇక్కట్ల పాల్జేశాడు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్ లో 180 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. భారత్ చేజార్చుకున్న ఐదు వికెట్లలో నాలుగు లియాన్ తీసినవే. 32 పరుగులు చేసిన సచిన్.. లియాన్ బౌలింగ్ లో వెనుదిరిగాడు.

కాగా, కెప్టెన్ ధోనీ (24 బ్యాటింగ్), జడేజా (12 బ్యాటింగ్) నిలకడగా ఆడుతూ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం భారత్ స్కోరు 209/5. ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరుకు టీమిండియా ఇంకా 53 పరుగులు వెనకబడి ఉంది. 

  • Loading...

More Telugu News