: సహారా అధినేత సుబ్రతోరాయ్ అరెస్ట్
సహారా సంస్థల అధినేత సుబ్రతోరాయ్ ని లక్నో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయాన్ని ఆయన తరపున వాదనలు వినిపిస్తున్న ప్రముఖ న్యాయవాది రాంజెఠ్మలానీ సుప్రీంకోర్టుకు తెలిపారు. సుబ్రతోరాయ్ ప్రస్తుతం పోలీసుల అదుపులోనే ఉన్నారని చెప్పారు. కోర్టు ధిక్కార కేసులో సుబ్రతోరాయ్ పై నాన్ బెయిలబుల్ వారెంట్ ఉంది. మార్చి 4న తదుపరి విచారణ ఉంటుందని న్యాయస్థానం తెలిపింది.