: ఆ ఇన్నింగ్స్ కోహ్లీ పరిణతికి మచ్చుతునక: గవాస్కర్
ఆసియాకప్ టోర్నీలో నిన్న బంగ్లాదేశ్ పై సెంచరీ సాధించి జట్టును విజయపథంలో నడిపిన కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఫతుల్లా పోరులో కోహ్లీ (136) ఇన్నింగ్స్ అతని పరిణతికి నిదర్శనమని పేర్కొన్నాడు. ఆ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరించిన సన్నీ, మైదానంలో కోహ్లీ తీసుకున్న ప్రతి నిర్ణయం, చర్య కచ్చితత్వంతో కూడుకున్నవని కితాబిచ్చాడు. కెప్టెన్సీని మంచినీళ్ళప్రాయంలా నిర్వహించాడని, ఎంతో బాధ్యతతో బ్యాటింగ్ చేశాడని కొనియాడాడు. జట్టును ముందుండి నడిపించే విషయంలో కోహ్లీని సచిన్, రాహుల్ సరసన చేర్చవచ్చని సన్నీ అభిప్రాయపడ్డాడు.