: బాలికను లైంగికంగా వేధించిన టీచర్ అరెస్ట్


ఓ మైనర్ బాలికను లైంగికంగా వేధించిన ఉపాధ్యాయుడిని అహ్మదాబాదు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు మీడియాకు తెలిపారు. బాధిత బాలిక 10వ తరగతి చదువుతోంది. బుధవారం సాయంత్రం ట్యూషన్ కు వెళ్లిన సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గణిత శాస్త్రానికి సంబంధించి సందేహాలు నివృత్తి చేస్తానని టీచర్ చెప్పడంతో, ఆయన వద్దకు ట్యూషన్ కు వెళ్లింది. అయితే, ఆ టీచర్ ట్యూషన్లో బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు.

  • Loading...

More Telugu News