: కాంగ్రెస్, బీజేపీలకు ఉద్యోగ సంఘాలు మద్దతివ్వవు: అశోక్ బాబు
కాంగ్రెస్, బీజేపీలకు ఉద్యోగ సంఘాలు మద్దతివ్వవని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, రాజకీయ వైఫల్యం కారణంగానే రాష్ట్ర విభజన జరిగిందని అన్నారు. ఆర్ధిక అభివృద్ధి కోసం కనీసం పదేళ్ల పాటు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించాలన్న అశోక్ బాబు... కాంగ్రెస్, బీజేపీలకు మద్దతు పలికే ప్రశ్నే లేదని స్పష్టం చేశారు.