: అభిమాని కోసం కచేరీ ఆపిన పాప్ స్టార్


పాప్ సంగీతం అంటే ఇష్టపడేవాళ్ళకు బియాన్సీ నోల్స్ సుపరిచితమే. 'బేబీ బోయ్' పాటతో ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ సంపాదించుకున్న ఈ అమెరికన్ గాయని తన అభిమాని కోసం ఏం చేసిందో చూడండి. ఇంగ్లండ్ లోని బర్మింగ్ హామ్ లో బియాన్సీ ఇటీవల ఓ కచేరీ నిర్వహించింది. వేలాది మంది హాజరైన ఆ కచేరీ ఉన్నట్టుండి నిలిచిపోయింది. అప్పటిదాకా తన హిట్ సింగిల్స్ ఆలపిస్తున్న బియాన్సీ ఓ పాట మధ్యలో ఉన్నట్టుండి 'హ్యాపీ బర్త్ డే టూ యూ' అని ఎత్తుకుంది. దీంతో, ఆ లైవ్ షోకు వచ్చిన వారికి ఏం జరుగుతుందో అర్థంకాలేదు. ఆ తర్వాత నిదానంగా విషయం చెప్పింది బియాన్సీ.

ఆమె పాడుతుండగా ముందు వరుసులో నిల్చున్న అభిమాని ఒకరు బర్త్ డే బ్యాడ్జి తగిలించుకుని ఉండడం గమనించింది. వెంటనే పాట ఆపి ఆ మహిళా ఫ్యాన్ ను వేదికపైకి పిలిచి హ్యాపీ బర్త్ డే పాట పాడి ఆమెను సంతోషపెట్టింది. తన కోసం తన ఆరాధ్యగాయని పుట్టినరోజు పాట పాడడం పట్ల షెహనాజ్ ఖాన్ అనే ఆ అభిమాని ఉబ్బితబ్బిబ్బయిపోయింది. వెంటనే ఆ వీడియోను కాస్తా యూట్యూబ్ లో పెట్టేసింది. కెమెరాలన్నీ తనవైపే ఫోకస్ చేయడం, అందరూ తనకు శుభాకాంక్షలు తెలపడం తానిప్పటికీ నమ్మలేకపోతున్నానని తెలిపింది.

  • Loading...

More Telugu News