: 'పల్నాడు జిల్లా' కావాలంటున్న కాసు
రాష్ట్ర విభజన అనంతరం సీమాంధ్ర ప్రాంతాల నుంచి పలు ప్రతిపాదనలు, డిమాండ్లు వినిపిస్తున్నాయి. కొత్తగా పల్నాడు జిల్లాను ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి కాసు కృష్ణారెడ్డి అంటున్నారు. ఈ మేరకు రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి దిగ్విజయ్ సింగ్ కు లేఖ రాశారు. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట, గురజాల డివిజన్లతో పాటు ప్రకాశం జిల్లాలోని మార్కాపురం ప్రాంతాన్ని కలిపి పల్నాడు పేరిట కొత్త జిల్లా ఏర్పాటు చేయాలని లేఖలో విజ్ఞప్తి చేేశారు. నరసరావుపేటను జిల్లా కేంద్రంగా చేయాలని కూడా సూచించారు. రాష్ట్రంలో ఈ మూడు ప్రాంతాలు బాగా వెనుకబడి ఉన్నాయని వివరించారు.