: కోలాహలంగా ప్రారంభమైన ఏడుపాయల జాతర


మహాశివరాత్రి పర్వదినాన తెలంగాణలో ఏడుపాయల జాతర కోలాహలంగా ప్రారంభమైంది. జాతర కోసం ఏడుపాయలలోని ఆలయం సుందరంగా ముస్తాబైంది. తెలంగాణలో అతి పెద్ద జాతరగా పేరొందిన ఏడుపాయల, ఏడాదికోసారి వారం రోజుల పాటు కొనసాగుతుంది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం నాగ్సాన్ పల్లి లో భారీ కొండరాళ్ల నడుమ సొరంగంలో వెలసిన దుర్గామాతకు ఏటా జాతర నిర్వహిస్తున్నారు. కొండలపై నుంచి నీరు ఏడుపాయలుగా ప్రవహించడంతో ఆలయానికి ఈ పేరు వచ్చిందని చెబుతారు. ఈ జాతరకు మన రాష్ట్రం నుంచే కాక మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారు.

  • Loading...

More Telugu News