: 'అసిస్టెంట్ కోచ్ నియామకం' వార్తలపై స్పందించిన బీసీసీఐ


టీమిండియాకు ఓ భారత మాజీ క్రికెటర్ ను అసిస్టెంట్ కోచ్ గా నియమిస్తున్నట్టు ఓ క్రికెట్ వెబ్ సైట్లో వచ్చిన వార్తలపై బీసీసీఐ స్పందించింది. అలాంటి నిర్ణయాలేమీ తీసుకోలేదని బోర్డు సెక్రటరీ సంజయ్ పటేల్ స్పష్టం చేశారు. విదేశీగడ్డపై భారత జట్టు భంగపాటుకు అడ్డుకట్ట వేసే క్రమంలో కోచ్ డంకన్ ఫ్లెచర్ కు సహాయకుడిగా ఓ భారతీయుణ్ణి నియమిస్తారని వార్తలొచ్చాయి. ఫ్లెచర్ తో పాటు బౌలింగ్ కోచ్ జో డాస్, ఫీల్డింగ్ కోచ్ ట్రెవర్ పెన్నీల పదవీకాలం మార్చి 31తో ముగియనుంది. అనంతరం జరిగే బీసీసీఐ వర్కింగ్ కమిటీ సమావేశంలో కొత్త కోచ్ పై నిర్ణయం తీసుకుంటామని పటేల్ తెలిపారు. కాగా, వచ్చే ఏడాది వరల్డ్ కప్ వరకు ఫ్లెచర్, పెన్నీల పదవీకాలాన్ని పొడిగించనున్నట్టు తెలుస్తోంది. అయితే, విదేశీ గడ్డపై బౌలర్ల పేలవ ప్రదర్శన ఫలితంగా బౌలింగ్ కోచ్ జో డాస్ సేవలను పొడిగించకపోవచ్చని బీసీసీఐ వర్గాలంటున్నాయి.

  • Loading...

More Telugu News