: తరుణ్ తేజ్ పాల్ కు జైలులో సౌకర్యాల కోత


తెహల్కా ఎడిటర్ తరుణ్ తేజ్ పాల్ కు గోవాలోని సదా సబ్ జైలులో కల్పిస్తున్న సౌకర్యాలకు జైలు అధికారులు కోత విధించారు. తేజ్ పాల్ ఉంటున్న సెల్ లో మొబైల్ ఫోన్ దొరికింది. దాంతో ఆయనకు తన కుటుంబ సభ్యులతో ములాఖత్, టెలిఫోన్ సౌకర్యాన్ని జైలు అధికారులు తొలగించారు. పనాజి నగరానికి 40 కిలోమీటర్ల దూరంలో సదా సబ్ జైలు ఉంది. తెహల్కాలో పనిచేసే మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించాడన్న ఆరోపణలతో తేజ్ పాల్ పై కేసు నమోదు అయిన విషయం విదితమే.

  • Loading...

More Telugu News