: కాంగ్రెస్ తో కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారు: మంద కృష్ణ మాదిగ
కాంగ్రెస్ పార్టీతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చీకటి ఒప్పందం చేసుకున్నారని మహాజన సోషలిస్టు పార్టీ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, పోలవరం ముంపు ఆదివాసీలను సీమాంధ్రకు వదిలిన కేసీఆర్ ను చరిత్ర క్షమించదని అన్నారు. ఆదివాసీలకు అన్యాయం చేశారని ఆరోపిస్తూ ట్యాంక్ బండ్ వద్ద కొమరంభీమ్ విగ్రహానికి పాలాభిషేకం చేశారు.