: ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒకటే: మర్రి
రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా..చేయకున్నా పెద్ద తేడా ఏమీ ఉండదని జాతీయ విపత్తు నివారణ సంస్థ ఉపాధ్యక్షుడు మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. ఢిల్లీలో దిగ్విజయ్ సింగ్ ను కలసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, త్వరలోనే ఎలాగూ ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని అందువల్ల కొత్త పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే అవకాశం లేదు కనుక ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒకటేనని అన్నారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటవుతుందా? లేదా? అనే దానికి రేపటికి తెరపడుతుందని అన్నారు. ఇక తెలంగాణ అపాయింటెడ్ డే ఎన్నికలకు ముందు ఉండాలని దిగ్విజయ్ ను కోరినట్టు తెలిపారు.