: జయలలిత నిర్ణయానికి సుప్రీం అడ్డుకట్ట
రాజీవ్ హంతకుల విడుదల నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. రాజీవ్ గాంధీ హత్య కేసు దోషుల విడుదలను నిలిపివేస్తూ స్టే ఇచ్చిన సుప్రీంకోర్టు, దానిపై విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. రాజీవ్ గాంధీ హంతకుల ఉరిశిక్షను జీవితఖైదుగా మార్చడంతో ఇప్పటికే శిక్ష కాలం ముగిసిందంటూ, తమిళుల మనోభావాలకు అనుగుణంగా జయలలిత సర్కారు రాజీవ్ గాంధీ హత్యకేసు దోషులు నలుగురి విడుదలకు సన్నాహాలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో సుప్రీంకోర్టు వారి విడుదలపై స్టే విధించింది.