: బ్యాటింగ్ కన్నా అంజలికి లేఖ రాయడమే కష్టమైంది: సచిన్


భారత బ్యాటింగ్ శిఖరం సచిన్ టెండూల్కర్ తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నాడు. మొబైల్ ఫోన్లు రాక ముందు తన భార్యకు లేఖ రాయాలంటే చాలా కష్టపడాల్సి వచ్చేదని చెప్పాడు. బ్యాటింగ్ చేయడం కన్నా అంజలికి లెటర్ రాయడమే క్లిష్టమైన పని అని పేర్కొన్నాడు. చెన్నైలో చేతిరాతపై నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సచిన్ తన జ్ఞాపకాలను పంచుకున్నాడు. అప్పట్లో మొబైల్ ఫోన్లు లేవని, సమాచారం కోసం ల్యాండ్ ఫోన్లు, ఉత్తరాలపై ఆధారపడాల్సి వచ్చేదని చెప్పాడీ మాస్టర్ ఆఫ్ బ్యాటింగ్ ఆర్ట్.

క్రికెట్ బంతిని కొట్టడమనేది నాకు సహజంగా అబ్బిన విద్య. కానీ, అంజలికి లేఖ అంటే మాత్రం రాసిన దాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాల్సి వచ్చేది' అని తెలిపాడు. అయితే, డాక్టర్ల చేతిరాత వంకరటింకరగా ఉంటుందని ఓ అభిప్రాయం ఉందని, అంజలి హ్యాండ్ రైటింగ్ మాత్రం పొందికగా ఉండేదని సచిన్ కితాబిచ్చాడు. ఇక క్రికెటర్లలో అనిల్ కుంబ్లే చేతిరాత అందంగా ఉంటుందని, బెంగాల్ బౌలర్ సుబ్రతో బెనర్జీ భావయుక్తంగా రాస్తాడని తెలిపాడు.

  • Loading...

More Telugu News