: ఆర్జేడీలో వివాదం వెనుక నితీష్ కుమార్?
ఒక్కసారే 13 మంది ఎమ్మెల్యేలు ఆర్జేడీకి రాజీనామా చేసి పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు ఝలక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారం నేపథ్యంలో నితీష్ పై లాలూ తీవ్ర వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే, ఆర్జేడీలో వివాదాల వెనుక ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఉన్నారంటూ వస్తున్న వార్తలు వాస్తవమేనని జేడీ(యు) నేత శివానంద్ తివారీ అన్నారు. ఎమ్మెల్యేలను మభ్యపెట్టడం వల్లనే రెబల్స్ గా మారారన్నారు.