: ఇన్ఫోసిస్ ఉద్యోగులకు 5 నుంచి 7 శాతం వేతనం పెంపు
ఇన్ఫోసిస్ ఉద్యోగులకు ఈ ఏడాది వేతన పెంపు నామమాత్రంగా ఉండబోతోంది. లెవల్ 2 నుంచి లెవల్ 6 వరకు ఉన్న ఉద్యోగులకు 5 నుంచి 7 శాతం పెంచనున్నట్లు చైర్మన్ నారాయణమూర్తి వారికి సమాచారం అందించారు. లెవల్ 2లో ఇంజనీరింగ్ కాకుండా ఇతర గ్రాడ్యుయేట్లు, కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ లు ఉండగా.. లెవల్ 6లో ప్రాజెక్టు మేనేజర్లు ఉన్నారు. లెవల్ 7, 8లో డెలివరీ మేనేజర్లు ఉండగా.. వీరి వేతన పెంపు శాతం ఇంకా తేలలేదు. కొత్త వేతనాలు ఏప్రిల్ నుంచి అమల్లోకి రానున్నాయి.