: రాహుల్ కు ఊహించని ముద్దులు
వయసు 40+ అయినా అచ్చం రారాజులా ఉంటాడు.. పాల బుగ్గలతో ఆకర్షిస్తూ ఉంటాడు. అలాంటి వ్యక్తి తమ కళ్ల ముందు కనిపించేసరికి ఓ ఇద్దరు మహిళలు కంట్రోల్ తప్పారు. ముద్దులతో ముంచెత్తారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహల్ గాంధీ నిన్న అసోంలోని జోర్హాట్ లో మహిళలతో ముఖాముఖి సమావేశమయ్యారు. మహిళల సాధికారత గురించి మాట్లాడుతున్నారు. మహిళలు అడిగిన ప్రశ్నలకు బదులిస్తున్నారు. ఇంతలో ఓ మహిళ మురిపెంగా రాహుల్ నుదుటిపై ముద్దు పెట్టుకోగా.. పక్కనే ఆబరాగా చూస్తోన్న ఓ నడి వయసు మహిళ రాహుల్ బుగ్గలను ముద్దాడి ముచ్చట తీర్చుకుంది.