: నాగబాబు కుమారుడి చిత్రానికి చిరంజీవి క్లాప్


నటుడు, నిర్మాత నాగబాబు కుమారుడు వరుణ్ తేజ హీరోగా తెరంగేట్రం చేస్తున్న చిత్రం షూటింగు ఈ రోజు హైదరాబాదులో ప్రారంభమైంది. ముందుగా నటుడు, కేంద్రమంత్రి చిరంజీవి, ఆయన భార్య సురేఖ దేవుడికి పూజ చేసి కొబ్బరికాయలు కొట్టారు. అనంతరం దేవుడి పటాలపై చిరంజివి క్లాప్ కొట్టి షూటింగు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి హీరో పవన్ కల్యాణ్, అల్లు అరవింద్, అర్జున్, శిరీష్, చిరు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్, ఈ చిత్రం దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల, నిర్మాతలు, దర్శకులు కె.రాఘవేంద్రరావు, వినాయక్, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు.

  • Loading...

More Telugu News