: విభజన తర్వాత సీమాంధ్రులు ఆందోళనలో ఉన్నారు: బీజేపీ నేత హరిబాబు
రాష్ట్ర విభజన తర్వాత సీమాంధ్రులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని బీజేపీ నేత కంభంపాటి హరిబాబు అన్నారు. కాబట్టి, సీమాంధ్రుల సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. విశాఖలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన హరిబాబు, సీమాంధ్రలో పుష్కలంగా వనరులు ఉన్నాయని, సహజ వనరులు ఉపయోగించుకుంటే సీమాంధ్ర అభివృద్ధి చెందుతుందని అన్నారు.